Latest Tech Uncategorized

స్పీల్ బర్గ్ దర్శకత్వంలో వర్చ్యువల్ రియాలిటీ పై వస్తున్న సినిమా Ready Player One ట్రైలర్ విడుదల

 

Virtual Reality ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న టెక్నాలజీ. వర్చ్యువల్ గా ఇంకో లోకాన్ని మన కళ్ళ ముందే చూపించడమే ఈ వర్చ్యువల్ రియాలిటీ యొక్క ప్రత్యేకత. ఈ వర్చ్యువల్ రియాలిటీ ఎక్కువసేపు చూడడం కళ్ళకు చాల ఇబ్బంది కలిగిస్తుంది. ఈ ఇబ్బందిని వీలైనంత తగ్గించడానికి దాదాపుగా ప్రతీ సంస్థ ప్రయత్నిస్తున్నాయి. Google , Facebook లాంటి సంస్థలన్నీ ఈ వర్చ్యువల్ రియాలిటీ పై ప్రస్త్తుతం పని చేస్తున్నాయి .

ఈ కోవలోనే ప్రఖ్యాత దర్శకుడు స్టీవెన్ స్పీల్ బర్గ్ ఈ వర్చ్యువల్ రియాలిటీ ఆధారంగా ఒక పూర్తి సినిమా నే తీసాడు. ఇందులో ఒయాసిస్ అనే వర్చ్యువల్ ప్రాంతాన్ని రక్షించడం అనే కథాంశం ఆధారంగా సినిమా నడుస్తుంది. భూమి మీద ఎక్కడ సరైన పరిస్థితులు లేకపోవడంతో వర్చ్యువల్ గా సృష్టించుకున్న ఒయాసిస్ లో అందరు కాలం వెళ్ళదీస్తుంటారు. కొన్నాళ్ళకి ఆ ఒయాసిస్ ను కూడా నాశనం చేసే పరిస్థితులు తలెత్తడంతో దాన్ని ఎలా రక్షించుకోగలిగారు అన్నదే సినిమా. ఈ సినిమాలో దాదాపుగా ప్రతీ ఒక్కరు వర్చ్యువల్ లోకం లోనే ఉంటారు. ఈ సినిమా ట్రైలర్ ని నిన్ననే విడుదల చేసారు.

Vishnu
May Be below average or above average but, not an average guy at all.I strive for tech, philosophy, science, politics, movies and I am sharing my knowledge on tech here.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *