Airtel కంపెనీ తమ 4G హాట్ స్పాట్ యొక్క ధరని తగ్గించింది. ఎక్కువ మంది వినియోగదారులకి కనెక్ట్ అవ్వడానికి Airtel ఈ వ్యూహాన్ని అనుసరిస్తుంది. Airtel 4G హాట్ స్పాట్ ద్వారా మొబైల్ , లాప్ టాప్, స్మార్ట్ టీవి లకు కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ వ్యూహం ద్వారా ముఖ్యంగా జియో వినియోగదారులను టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
Airtel హాట్ స్పాట్ ధర ని 1,500 నుంచి 999 రూపాయలకే తగ్గించారు. జియో హాట్ స్పాట్ ధరకూడా 2,000 రూపాయల నుంచి 999 రూపాయలకు తగ్గించారు. airtel హాట్ స్పాట్ ఉపయోగించాలి అంటే airtel సిమ్ కచ్చితంగా ఉండాల్సిందే. వేరే సిమ్ కార్డు లు ఉపయోగించడం కుదరదు. 4G నెట్ వర్క్ ఒకవేళ లేనట్టయితే హాట్ స్పాట్ ఆటోమేటిక్ గా 3G నెట్ వర్క్ కి కనెక్ట్ అయిపోతుంది . ఈ ధర మార్పు త్వరలోనే అన్ని రిటైల్ మరియు ఆన్లైన్ అవుట్ లెట్ లలోను వర్తిస్తుంది. అమెజాన్ ద్వారా ఈ హాట్ స్పాట్ అందుబాటులో ఉంది.