Latest Tech Uncategorized

Apple కంపెనీ విడుదల చేసిన AR(Augmented Reality) యాడ్.

 

ఈ సంవత్సరం జరిగిన WWDC 2017 సదస్సులో ఆపిల్ కంపెనీ Augmented Reality కి సంబంధించి హడావిడి చేసిన సంగతి తెలిసిందే. ఆ షో తరువాత టిం కుక్ (Apple CEO ) నుంచి అక్కడక్కడ కొన్ని కామెంట్ లు తప్పా ఇంకెక్కడా ఎటువంటి ప్రచారం AR కు సంబంధించి జరగలేదు. కానీ ఈ సోమవారం నాడు Apple ఒక యాడ్ ని AR కు సంబంధించి సైలెంట్ గా విడుదల చేసింది.

ఈ యాడ్ లో iPad ప్రో ఉన్న వ్యక్తి సిటీ స్క్వేర్ సెంటర్ లో కుర్చుని ఉన్న ఇంకో వ్యక్తిని షూట్ చేస్తూ పక్కనే ఫర్నిచర్ ను ఆడ్ చెయ్యడం తో మొదలవుతుంది . ఇందులో జత చేసిన ఫర్నిచర్ పరిసరాలలో చక్కగా ఇమిడిపోవడం AR క్వాలిటీ పై అంచనాలను పెంచుతుంది. ఈ యాడ్ లో ఉపయోగించిన ఆప్ House Craft అనే అప్లికేషన్. ఇది AR ద్వారా Home decoration చెయ్యడానికి సహాయ పడుతుంది. AR లో మనం అక్కడ లేని వస్తువులని ఉంచడం సాధ్య పడుతుంది. వాటిని ఉంచడమే కాకుండా 360 డిగ్రీల కోణం లో అవికూడా మన దిశను బట్టి మారుతాయి. చాల సింపుల్ గా ఈ యాడ్ ని డిజైన్ చేసారు. ఈ యాడ్ ద్వారా Apple త్వరలో AR కు సంబంధించి అడుగులు వెయ్యబోతున్నట్లు తెలుస్తోంది. గూగుల్ సంస్థ కూడా ఈ AR టెక్నాలజీ పై పని చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో గూగుల్ కూడా ఈ AR టెక్నాలజీ పై ఆప్ తీసుకుని వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Vishnu
May Be below average or above average but, not an average guy at all.I strive for tech, philosophy, science, politics, movies and I am sharing my knowledge on tech here.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *