Latest Tech Uncategorized

ACT Fiber net లాంచ్ చేసిన 1 GB/S ఇంటర్నెట్ ప్లాన్.

ఇండియాలో జియో రాకముందు వరకు కూడా సాదారణ ఇంటర్నెట్ వేగం broadband విషయంలో 133 దేశాలకు గాను 73 వ స్థానం , అలాగే మొబైల్ డేటా విషయంలో 122 దేశాలకు గాను 112 వ స్థానం లో ఉంది. జియో వచ్చాక ఈ లెక్కలు మారిపోయినప్పటికి ఇప్పటికి స్పీడ్ విషయంలో వెనుకపడి ఉన్నాం. వ్యక్తిగత అవసరాలకు ఈ ఇంటర్నెట్ స్పీడ్ సరిపోవచ్చేమో కాని వ్యాపార అవసరాలకు ఇంకా ఎక్కువ వేగం కావాల్సి ఉంటుంది.

వీటినన్నిటిని దృష్టిలో ఉంచుకుని ACT broadband 1 GBps హై స్పీడ్ ఇంటర్నెట్ ప్లాన్ ను లాంచ్ చేసింది . Google fibre (మన దేశంలో లేదు ) కాకుండా 1GBps ప్రస్తుతం ఏ కంపెనీ ఇవ్వట్లేదు. ఈ 1GBps ప్రస్తుతం హైదరాబాద్ తర్వాత బెంగుళూరు లో లాంచ్ అవ్వడం గమనార్హం. త్వరలోనే ఈ 1 GBps స్పీడ్ ని మిగతా అన్ని మెట్రో నగరాలలో కూడా లాంచ్ చెయ్యవచ్చు.

ఇండియాలో చాలా కంపెనీలు AR (Augmented reality ) మరియు VR (Virtual Reality ) టెక్నాలజీ లపై పని చేస్తున్నాయి. వీటికి ఇంటర్నెట్ వేగం చాల ముఖ్యం. ఇప్పుడు సగటున లభించే స్పీడ్ తో ఒక సాధారణ youtube వీడియో ని అత్యధికమ 4K క్వాలిటీ తో చుడగల వేగం దొరుకుతుంది. VR లో అన్ని వైపుల అదే క్వాలిటీ లో వీడియో లోడ్ అవ్వాలంటే ఇప్పుడు ఉండే వేగం యే మాత్రం సరిపోదు. కేవలం డెవలప్ చేసే వాళ్ళకే కాకుండా ఆ సర్వీస్ లు వినియోగించే వారికి కూడా ఈ వేగం ఏ మాత్రం సరిపోదు.

5,999 రూపాయలకి ఈ 1GB/s ప్లాన్ లభిస్తుంది. 1,250 GB అప్ లోడ్ అలాగే 1,250 GB డౌన్ లోడ్ వరకు ఈ స్పీడ్ వర్తిస్తుంది. Giga Plus ప్లాన్ లో 5 TB ల వరకు ఈ లిమిట్ పోడిగిస్తారు. ఇతర ప్లాన్ లలో ఉన్నవాళ్లు ఈ ప్లాన్ లోకి మారడానికి 2,500 రూపాయలు పే చేస్తే మారిపోవచ్చు.

Vishnu
May Be below average or above average but, not an average guy at all.I strive for tech, philosophy, science, politics, movies and I am sharing my knowledge on tech here.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *