Apps Uncategorized

Facebook యాడ్ లలో whatsapp బటన్.

Whatsapp లో ఎలాంటి ads ఉంచము అని whatsapp ఫౌండర్ లు ఎప్పుడో చెప్పారు. కాని whatsapp ను కొన్న facebook మాత్రం దాన్ని పెద్దగ పట్టించుకోవట్లేదు. త్వరలో నే whatsapp ను కూడా వీలైనంత ఆదాయం వచ్చే వనరుగా మార్చడానికి ప్రయత్నిస్తూ ఉంది. ఆ కోవలోనే whatsapp for business పేరిట కంపెనీ లకు ప్రత్యేక సదుపాయాలతో whatsapp ను ఇవ్వబోతుంది.

ఇదే కాకుండా పేస్ బుక్ యాడ్ లలో ఇకనుంచి యాడ్స్ పోస్ట్ చేసే వాళ్ళు whatsapp బటన్ ని ఉంచుకునేలా ఫీచర్ ని తీసుకువచ్చింది. ఈ ఫీచర్ లో యాడ్ కింద whatsapp ద్వారా కాంటాక్ట్ అవ్వడానికి లేదా ఇంకెవరికైనా ఆ యాడ్ షేర్ చెయ్యడానికి ఇలా ఆప్షన్ లని తీసుకు రాబోతుంది. ఈ ఫీచర్ ని ముందుగ ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆఫ్రికా, కొద్ది ప్రదేశాలలో మాత్రమే ఆసియా లలో తీసుకు రానుంది. ఈ ఫీచర్ ని యూరోపు లో కూడా తీసుకురావలనుకుంది కాని మిగతా చోట్ల రేస్పోన్స్ చూసి తర్వాత యూరోప్ లో అమలయ్యేలా చూడడానికి నిర్ణయించుకుంది. ఈ ఫీచర్ త్వరలో అందరికి అందుబాటులోకి రావొచ్చు.

Vishnu
May Be below average or above average but, not an average guy at all.I strive for tech, philosophy, science, politics, movies and I am sharing my knowledge on tech here.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *