Apps Uncategorized

Grammery keyboard ద్వారా ఇంగ్లీష్ గ్రామర్ మరియు స్పెల్లింగ్ తప్పులు లేకుండా రాయడం సులువు

ఇంగ్లీష్ గ్రామర్ మరియు స్పెల్లింగ్ తప్పులు సరిచేసే Grammarly కీ బోర్డు ఆండ్రాయిడ్ మరియు ఐఫోన్ లకు విడుదల అయింది. Grammarly ఇప్పటి వరకు కంప్యూటర్ బ్రౌజరు plug-in గా ఆదరణ పొందింది.

క్లౌడ్ ఆధారంగా పనిచేసే ఈ app పూర్తిగా పని చేయుటకు ఇంటర్ నెట్ తప్పనిసరి. ఇంటర్ నెట్ లేకుండా ఇతర కి బోర్డు మాదిరి కేవలం spell చెక్ మాత్రమే పని చేస్తుది. Swipe టైపింగ్ విధానం ఇందులో పనిచేయదు.

ఈ app డేటా facebook లేదా గూగుల్ ఎకౌంటు ద్వారా సింక్ అయి ఉంటుంది, వివిధ డివైస్(కంప్యూటర్, టాబ్లెట్, మొబైల్) మీరు టైపు చేసిన మీ హిస్టరీ కి ఆధారంగా ఎక్కువగా వాడే పదాల ను మీకు సలహా అందిస్తుంది. మీ వ్యక్తిగత డిక్షనరీ ద్వారా మీకు సంబందించిన పదాలు అందులో add చేయొచ్చు.

కంప్యూటర్ లో grammarly ని బ్రౌజరు plug-in ద్వారా వాడొచ్చు ఈ plug-in లో గ్రామర్ మరియు స్పెల్లింగ్ తో పాటు ఇంగ్లీష్ డిక్షనరీ ద్వారా పదాల అర్థలు కూడా తెలుసుకోవచ్చు. grammarly app ని ఈ క్రింది లింక్ ద్వారా పొందొచ్చు.

https://play.google.com/store/apps/details?id=com.grammarly.android.keyboard

Dhanu Arjun
A Guy with an extra ounce curiosity on tech, science, Electronics.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *