App Report Apps Uncategorized

5 బెస్ట్ ఈ – బుక్ రీడర్ ఆప్ లు.

మనలో చాలామంది పుస్తకాలు చదివే అలవాటు ఉంటుంది. కానీ వాటిని ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకు వెళ్ళడం కుదరదు. ఒకవేళ తీసుకువెళ్ళడానికి ప్రయత్నించినప్పటికీ, 3-4 పుస్తకాల కంటే ఎక్కువగా తీసుకుని వెళ్ళలేము. ఇ-బుక్ రీడర్లు అనే చిన్న ఆప్ లు మొబైల్లు, టాబ్లెట్లలో పుస్తకాలు చదివేందుకు ఉపయోగపడతాయి. ఈ ఆప్స్ పుస్తకాలు చదవడమే కాకుండా ఇంకా చాలా చెయ్యగలవు . ఈ ఆప్స్ మనం చివరగా చదివిన పేజి ని గుర్తుపెట్టుకుని మళ్ళీ మనం చదవలనుకున్నపుడు అదే పేజి దగ్గర ఓపెన్ అవుతాయి. రాత్రి పూట కళ్ళకు ఇబ్బంది కలగకుండా ఉండడానికి నైట్ మోడ్ అనే సౌలభ్యాన్ని అందిస్తాయి. పాదాలకు అర్థం కోసం డిక్షనరీ వెతికే పనిలేకుండా అక్కడే అర్థాన్ని వెతికి చూపిస్తాయి. పుస్తకంలో ముఖ్యమైన పాయింట్ లని మార్క్ చేసుకోడానికి ఉపయోగపడ్తుంది.

నేను చాలా ఇ-బుక్ రీడర్లు, దాదాపు 10+ ఆప్స్ ప్రయత్నించాను.కానీ ఈ 5 ఆప్స్ పుస్తకాలు చదవడానికి చాల సౌకర్యంగా అనిపించినవి.

1.Google Play Books

గూగుల్ ప్లే బుక్స్ ఆప్ పుస్తకాలు చదవడానికి చాల అనుకూలంగా ఉంటుంది. ఈ ఆప్ లో ఉన్న సమస్య ఏంటంటే బుక్స్ కేవలం గూగుల్ ప్లే ద్వారానే కొనాలి . బయట కొన్నవి ఇక్కడ సపోర్ట్ చెయ్యవు. ఇందులో దాదాపుగా అన్ని ఈ-బుక్ రీడర్ ఫీచర్లు ఉన్నాయి. కొన్ని ఫార్మటు లలోని పుస్తకాలు మాత్రమే సపోర్ట్ చేస్తాయి.

Install Here : http://bit.ly/2ztVtiF

2.Kindle By Amazon

kindle లో కూడా అన్ని ఫీచర్లు ఉన్నప్పటికీ కేవలం అమెజాన్ ద్వారా కొన్నవి మాత్రమే చదవొచ్చు. ఎక్కువ ఫార్మటు పుస్తకాలు సపోర్ట్ చెయ్యవు కాబట్టి కేవలం అమెజాన్ లో కోనేత్తితేనే ఈ kindle చాలా ఉపయోగపదుతుంది.

Install Here : http://bit.ly/2hgJ4Em

3.Aldiko Reader

ఈ ఆప్ లో రెండు వెర్షన్ లు లభిస్తాయి . ఉచిత వెర్షన్ అలాగే ప్రీమియం వెర్షన్. ఫ్రీ వెర్షన్ లో టెక్స్ట్ హై లైట్ చెయ్యడం , బుక్ మార్క్ చేసుకోవడం లాంటి ఫీచర్లు అందుబాటులో లేవు. అన్ని ఫార్మటు లలోని పుస్తకాలు దాదాపుగా సపోర్ట్ చేస్తాయి . aldiko సంస్థ ఎలాంటి పుస్తకాలు అమ్మట్లేదు . వేరే సైట్ లలో డౌన్లోడ్ చేసుకుని ఇక్కడ చదవొచ్చు.

Install Here : http://bit.ly/2hfvFwg

4.FB reader

FB Reader లో పై ఆప్స్ కంటే ఎక్కువ ఫార్మాట్లు సపోర్ట్ చేస్తాయి. కాని దీని యూజర్ ఇంటర్ఫేస్ అంతగా బాగోదు. అంతర్గతంగా డిక్షనరీ సౌలభ్యం కూడా లేదు. కానీ ప్లగ్ ఇన్ ద్వారా డిక్షనరీ ని పొందవచ్చు.

Install Here : http://bit.ly/2hfw69S

5.Moon Reader

మూన్ రీడర్ లో మిగతా ఆప్స్ లో లేని ఫీచర్ ఏంటంటే TTS ఇంజిన్ సపోర్ట్. ఈ TTS ద్వారా ఆప్ పుస్తకాన్ని చదివి వినిపిస్తుంది. ఈ ఫీచర్ Moon Reader Pro లో మాత్రమే లభిస్తుంది. ఫ్రీ వెర్షన్ లో లభించదు. ప్రో వెర్షన్ 320 రూపాయలకు లభిస్తుంది.

Install Here : http://bit.ly/2hflnML

 

Vishnu
May Be below average or above average but, not an average guy at all.I strive for tech, philosophy, science, politics, movies and I am sharing my knowledge on tech here.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *