Latest Tech Uncategorized

Facebook కొత్త SNOOZE ఫీచర్

 

ఒక్కసారి ఊహించుకోండి మీ ఫ్రెండ్ ఆ పెళ్లిలో జరిగిన ఫోటోలు అన్ని facebook నిండా నింపేస్తుంటే. మీ బంధువు ఆ చెత్త వీడియో లు అన్ని షేర్ చేస్తూ ఉంటే. చాలా చిరాకుగా అనిపిస్తుంది కదా. పోనీ అన్ ఫ్రెండ్ చేద్దామా అంటే ఎక్కడ ఫీల్ అవుతారా అనే ఒక ఫీలింగ్.

ఇలాంటి ఇబ్బందులు ఉంటాయని ఫేస్ బుక్ unfollow అనే ఆప్షన్ ని ఇది వరకే తెచ్చిన సంగతి తెలిసిందే. Unfollow చేసినపుడు మన ఫ్రెండ్/బంధువుకి unfollow అయినట్లు కనిపించదు కానీ ఫ్రెండ్ గానే ఉన్నట్లు కనిపిస్తాం. ఈ ఫీచర్ నే snooze లా మారుస్తూ కేవలం 30 రోజుల వరకు మాత్రమే unfollow అయ్యేలా ఈ ఫీచర్ ని రూపొందించింది. మాములుగా Unfollow ఆప్షన్ ఉపయోగిస్తే ఫ్రెండ్ యొక్క ఏ పోస్ట్ కాని అప్డేట్ లు కాని మనకు కనిపించవు. కాని ఈ snooze ఆప్షన్ వలన కేవలం 30 రోజుల వరకే కనిపించకుండా ఉంటాయి. తర్వాత మల్లి యధా విధిగా కనిపిస్తాయి.

ఈ ఆప్షన్ ని ఇంతకుముందే కొద్ది మంది యూజర్లకి మాత్రమే వదిలినప్పటికి ఇప్పుడు ఈ ఆప్షన్ అందరికి అందుబాటులో ఉంది.

ఇంకెందుకు ఆలస్యం. ఆ చిరాకు పరిచే ఫ్రెండ్/అంకుల్ /ఆంటీ (నా సలహా అయితే Unfollow కొట్టేయమని, మీ ఇష్టం మరి) లని snooze చేసి ప్రశాంతంగా ఉండండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *