Latest Tech Uncategorized

అన్ని ఆండ్రాయిడ్ మొబైల్ లకి వస్తున్న Hey Google కమాండ్

2013 లో గూగుల్ Google Assistant ను పిక్సెల్ మరియు Nexus డివైస్ లకు మాత్రమే ముందుగా విడుదల చేసింది. అసిస్టెంట్ ను వాయిస్ ద్వారా ఆక్టివేట్ చెయ్యడానికి OK GOOGLE అనే కమాండ్ ని నిర్దేశించింది. తర్వాత ఈ గూగుల్ అసిస్టెంట్ ని ఇతర మొబైల్ లలో కూడా వినియోగించుకునేల గూగుల్ అందరికి విడుదల చేసింది. గూగుల్ హోం డివైస్ లలో వాయిస్ ద్వారా Hey Google అనే కమాండ్ ని ఉపయోగించడం మొదలెట్టింది.

Hey Google కమాండ్ హోం డివైస్ లకు మాత్రమే ఉంటుందేమో అనుకున్నారు కానీ దీన్ని అన్ని డివైస్ లకు OK GOOGLE తో పాటే పని చేసేలా రూపొందిస్తున్నట్లు గూగుల్ అసిస్టెంట్ పాత వెర్షన్ ల కోడ్ చెక్ చెయ్యడం ద్వారా తెలిసింది. Hey Google కమాండ్ ని గూగుల్ పిక్సెల్ డివైస్ లకు మాత్రమే విడుదల చేసింది. ఇతర డివైస్ లకు కూడా త్వరలో వస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం గూగుల్ పిక్సెల్ కాదని ఇతర brand ఆండ్రాయిడ్ డివైస్ లకు కూడా ఈ Hey Google కమాండ్ రోల్ అవుతున్నట్లు తెలుస్తుంది. రెండు కమాండ్ లని వాడుకోగలమా లేదా అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఫీచర్ అందరికి రోల్ అవ్వడానికి కనీసం 2 నెలలు ఐన పట్టొచ్చు అని అంచనా .

Vishnu
May Be below average or above average but, not an average guy at all.I strive for tech, philosophy, science, politics, movies and I am sharing my knowledge on tech here.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *