Apps Uncategorized

Jio TV ఇక ఆప్ అవసరం లేకుండానే లైవ్ ఛానళ్లు చూడొచ్చు. 

జియో టీవీ ఆప్ ద్వారా HD మరియు సాధారణ క్వాలిటీలో లైవ్ ఛానల్ లు చూడొచ్చు అనే సంగతి మీకు తెలిసిందే. ఈ ఆప్ ద్వారా లైవ్ గా చూడడమే కాకుండా అయిపోయిన కంటెంట్ ని కూడా వెనక్కు వెళ్లి చూడొచ్చు. ఈ ఆప్ ప్రస్తుతం వేరే ఏ ఇతర ఆప్ కన్నా ఎక్కువ ఛానళ్లు ఇవ్వడమే కాకుండా నాణ్యత పరంగానూ అద్భుతంగా ఉంది.

Jio TV ని ఇకనుంచి ఆప్ లేకుండా కూడా ఉపయపగించొచ్చు. దీనికోసం జియో టీవీ వెబ్ సైట్ ని రూపొందించింది. http://jiotv.com ద్వారా లైవ్ ఛానల్ లని వీక్షించవచ్చు. జియో అకౌంట్ ద్వారా లాగిన్ అయ్యి ఛానల్ లని వెబ్ సైట్ లొనే వీక్షించవచ్చు. జియో సినిమా ఆప్ ని ఇంతకుముందే జియో సినిమా వెబ్ సైట్ ద్వారా అందుబాటులోకి తెఛ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే బాటలో జియో టీవీని కూడా లాంచ్ చేసింది.

జియో టీవీ వెబ్ సైట్ లో జియో టీవీ ఆప్ లాగే అన్ని విభాగాలలోని ఛానళ్లు వస్తాయి. తెలుగు , తమిళ్, కన్నడ , ఉర్దూ, మలయాళం, హిందీ , బెంగాలీ, గుజరాతీ , పంజాబీ, ఒడియా, భోజ్పురీ , అస్సామీ, నేపాలీ, ఫ్రెంచ్ భాషల్లో ఛానెళ్లు వస్తాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *