ఏదైనా న్యూస్ చదవడం కోసం ఎదో ఒక వెబ్ సైట్ ఓపెన్ చేస్తాం. పైన ఎక్కడో చదువుతూ ఉంటె కింద ఎక్కడో వీడియో ఆటోమేటిక్ గా ప్లే అవ్వడం స్టార్ట్ చేస్తుంది. మనకు ఎం జరుగుతుందో అర్థం కాదు. మ్యూజిక్ కొంచెం వినసొంపుగా , మృదువుగా ఉంటె పర్లేదు కానీ ఎక్కువ శబ్దం తో మ్యూజిక్ మొదలైతే ఎం చెయ్యాలో తెలీక ఆ ట్యాబ్ మొత్తాన్ని క్లోజ్ చేసేసి ఇంకో సారి ఆ వెబ్ సైట్ కి మాత్రం రాకూడదు అని తిట్టుకుంటాం . గూగుల్ దీన్నే చాల సీరియస్ గా తీస్కుంది.
అందుకే ఇకనుంచి ఆటోమేటిక్ గ ప్లే అయ్యే వీడియో లు కనుక ఉంటె మ్యూట్ అయ్యి ప్లే అయ్యేలా గూగుల్ క్రోమ్ కొత్త వెర్షన్ ని డిజైన్ చేస్తుంది. శుక్రవారం రిలీజ్ అయిన Chrome 64 beta వెర్షన్ లో ఈ ఫీచర్ ని జోడించింది. జనవరి నెలలో అందరి యూజర్లకి ఈ Chrome 64 రిలీజ్ అయింది. ఈ ఫీచర్ ని పూర్తిగా ఆటో ప్లే వీడియోలని ఆపేసేలా ముందు ముందు మారుస్తున్నట్లు తెలుస్తుంది. క్రోమ్ ఏదైనా వెబ్ సైట్ లో ఆటో ప్లే అయ్యే వీడియో ఉంటె మనల్ని మ్యూట్ చెయ్యల వద్ద అని అడుగుతుంది. మ్యూట్ చెయ్యమని ఆదేశిస్తే తరువాత ఎప్పుడైనా ఆ సైట్ ఓపెన్ చేసినప్పుడల్లా ఆటోమేటిక్ గా మ్యూట్ చేసేస్తుంది. ఈ ఫీచర్ క్రోమ్ డెస్క్ టాపు బ్రౌజరు లకు మాత్రమేనా లేక మొబైల్ బ్రౌజర్ కు కూడా ఇస్స్తున్నర అన్నది తెలియాల్సి ఉంది.