Mobile Uncategorized

Flipkart Billion Capture plus లానే Amazon తీసుకు రానున్న సొంత బ్రాండ్ మొబైల్

సొంత బ్రాండ్ ఉత్పత్తులపై మార్కెట్ లో ఆసక్తి ఎక్కువవుతు ఉంది. ముక్యంగా ఇండియాలో ఈ ట్రెండ్ ఇప్పుడిప్పుడే మొదలయింది. అమెజాన్ ఇంతకుముందే అమెరికా లో అమెజాన్ ఫైర్ పేరుతో మొబైల్ లని విడుదల చేసి చేతులు కాల్చుకుంది. దానికి ముక్యంగా ఫైర్ OS ఏ కారణం అయిండవచ్చు. కానీ అదే ప్లాన్ ని ఇప్పుడు ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంతోనే అమలు పరచడానికి అమెజాన్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

ఒక నెల క్రితం ఏ విడుదల అయిన FlipKart Billion Capture Plus ఎంత విజయవంతంయ్యిందో ఇంకా తెలీదు కానీ అమెజాన్ సంస్థ ని కూడా అదే బాటలో పయనించేలా చెయ్యడానికి అంతో ఇంతో దోహదపడింది. ఫ్లిప్ కార్ట్ తమ సొంత బ్రాండ్ మొబైల్ వదలటానికి కొన్ని నెలలో ముందే TENOR బ్రాండ్ పేరుతో రెండు మోడల్స్ ని అమెజాన్ లాంచ్ చేసింది. వీటి సేల్స్ పరంగా ఎలా ఉంది ఏమిటి అన్న వివరాలేమీ తెలియదు. ఇప్పుడు ఈ బ్రాండ్ ని త్వరలో తమ అధికారిక బ్రాండ్ మొబైల్ గా ప్రకటించవచ్చు అని సమాచారం.

1,000 వరకు చైనా మొబైల్ బ్రాండ్ లే మొబైల్ మార్కెట్ ని దాదాపుగా ఆక్రమించేశాయి. ఇలాంటి సమయంలో సొంత బ్రాండ్ మొబైల్ ఎంత వరకు ఫలితాలిస్తుంది అన్నది అనుమానమే. మొబైల్ మార్కెట్ విస్తరణ ప్రతీ సంవత్సరం ఉహించనంత జరుగుతున్నప్పటికీ నిజంగా ఎంతవరకు ఒక కొత్త బ్రాండ్ మొబైల్ కోసం లోటు ఉంది అన్నది నిజంగా అనుమానమే. Tenor బ్రాండ్ లో Tenor E అలాగే Tenor G మోడల్ లు వదిలారు రెండు కూడా దాదాపుగా Xiaomi redmi 4 అలాగే Xiaomi Red Mi Note 4 మొబైల్ ఫీచర్లు మరియు ధరలోనే లభిస్తున్నాయి. అలాంటప్పుడు కొత్త బ్రాండ్ మొబైల్ అవసరమా అన్నది ఒక ప్రశ్నే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *