Cyber Security Uncategorized

దివాలా తీసిన కొరియా BitCoin ఎక్స్చేంజి.

దక్షిణ కొరియా దేశానికి సంబంధించిన BitCoin మారకపు సంస్థ Youbit దివాలా తీస్తున్నట్లు ప్రకటించింది. హ్యాకర్లు తమ సైట్ ద్వారా బిట్ కాయిన్ లని దొంగిలించడం వలన ఈ పని చేస్తున్నట్లు కంపెనీ తమ అధికారిక వెబ్ సైట్ లో ప్రకటించింది . టోటల్ ఆస్తులలో 17% ఆస్తులు ఈ హ్యాక్ ద్వారా దొంగిలించ బడ్డాయి అని కంపెనీ ఒక మెసేజ్ లో తెలియజేసింది. ఈ హ్యాక్ youbit ఎక్స్చేంజి పై ఈ సంవత్సరంలో జరిగిన రెండవ ఎటాక్. ఏప్రిల్ నెలలో కూడా ఈ కంపెనీ పై ఎటాక్ జరిగింది.

కంపెనీ పై ఏప్రిల్ లో జరిగిన మొదటి ఎటాక్ కు ఉత్తర కొరియా దేశం కారణం గా youbit సంస్థ భావిస్తోంది. ఈ రెండవ ఎటాక్ వలన డిపాజిట్లు మరియు డబ్బు విత్ డ్రా చేసుకోడం లాంటి సర్వీస్ లు నిలిపివేసినట్లు కంపెనీ తెలిపింది. ఈ హ్యాక్ కారణం గా యూజర్లకి పూర్తి గా రీ ఫండ్ రాకపోవచ్చని, 75 % వరకు ముందు సెటిల్ చేసి మిగతాది దివాలా నియమాల ప్రకారం సెటిల్ చేస్తున్నట్లు Youbit ఎక్స్చేంజి సంస్థ తెలిపింది. ఇప్పుడు జరిగిన హ్యాక్ ఏప్రిల్ నెలలో జరిగిన హ్యాక్ కంటే చిన్నదే నని కాని ఈ రెండు హ్యాక్ ల వల్ల చాల వరకు ఆస్తులు కోల్పోయినట్టు కంపెనీ తెలిపింది.

Vishnu
May Be below average or above average but, not an average guy at all.I strive for tech, philosophy, science, politics, movies and I am sharing my knowledge on tech here.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *