Apps Uncategorized

Windows store నుంచి Google Chrome ని తొలగించిన Microsoft

Google ఒక చిన్న Chrome installer అప్లికేషన్ ని విండోస్ స్టోర్ లో ఉంచింది. దాన్ని Microsoft సంస్థ తమ నిబంధనలకు అనుకూలంగా లేదు అనే కారణంతో తొలగించింది. Microsoft Windows store పాలసీ ఈ Chrome Installer అప్లికేషన్ యొక్క నిర్మాణానికి సరిపోకపోవడంతో ఈ అప్లికేషన్ ని తొలగిస్తున్నట్లు తెలిపింది . ఈ సమస్య ముక్యంగా Microsoft Windows 10S ఆపరేటింగ్ సిస్టం మూలంగా వస్తున్నట్లు Google సంస్థ తెలిపింది .

Windows Store ఆప్స్ అన్ని ఇంటర్నెట్ బ్రౌజ్ చెయ్యాలంటే కచ్చితంగా Microsoft సంస్థ యొక్క HTML మరియు Java Script engine లనే ఉపయోగించాల్సి ఉంటుంది. కానే Google Chrome తమ సొంత ఇంజిన్ లని ఉపయోగిస్తూ Blink రెండరింగ్ ఇంజిన్ ని ఉపయోగిస్తూ ఉంది. Windows store లో ఆప్ ఉండాలి అంటే Google కచ్చితంగా ప్రత్యేకంగా Microsoft ఇంజిన్ లతో అప్లికేషన్ రుపొందించాల్సి ఉంటుంది. ఇది పెద్ద సమస్య కాదు కానీ Windows 10S కి చాల తక్కువ మంది యూజర్స్ ఉన్నారు . ఆ రకంగా పోల్చుకుంటే ప్రత్యేకంగా ఆప్ తయారు చెయ్యడమనేది పెద్ద ప్రయాసే.

Google ఈ installer ఆప్ ని కేవలం Windows Store లో ఉన్న అనేక ఫేక్ chrome ఆప్స్ నుంచి యుజర్లని రక్షించడానికి పెట్టింది . కానీ ఈ ప్రయత్నాన్ని కూడా మైక్రో సాఫ్ట్ తొలగించడం తో Windows 10S యూజర్లు క్రోమ్ ఆప్ ఉపయోగించాలి అంటే Edge బ్రౌజరు ద్వారా క్రోమ్ ఆప్ ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది .

Google కి అలాగే Microsoft కి సంబంధించి ఈ వార్ ఇంతకుముందునుంచే ఉంది. ఇంతకుముందే Youtube For Microsoft Mobile ఆప్ కు సంబంధించి Google యాడ్ పాలసీ ఇబ్బందిగా ఉన్నట్లు అలాగే క్రోమ్ ఎక్కువ బ్యాట్టరి తినేస్తున్నట్లు ఇలా ఎన్నో అభియోగాలు గూగుల్ పై మోపింది. దీనిపై Google ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *