Mobile Uncategorized

10.or D (Tenor D) ని కేవలం 4,999 కే లాంచ్ చేసిన Amazon

 

Amazon కూడా తమ సొంత బ్రాండ్ మొబైల్ విడుదల చెయ్యబోతుంది అని కొద్ది రోజుల ముందే తెలిపిన సంగతే . Tenor కంపెనీ ఇంతకుముందే వదిలిన రెండు మోడల్ లు కాదని ఇప్పుడు Amazon కోసం ప్రత్యేకంగా చెయ్యబడిన Tenor D మోడల్ ని అతి తక్కువ ధరలో విడుదల చేసింది. Tenor D మోడల్ ధర 4,999 రూపాయల నుంచి మొదలవుతుంది.

Tenor D మొబైల్ రెండు మెమరీ వేరియంట్ లలో లభిస్తుంది. 2 GB అలాగే 3 GB వేరియంట్ లలో లభిస్తుంది.2 GB వేరియంట్ లో అంతర్గత మెమరీ 16 GB కాగా , 3 GB వేరియంట్ లో 32 GB అంతర్గత మెమరీ తో లభిస్తుంది. మెమరీ కార్డు ద్వారా అంతర్గత మెమరీ ని 128 GB వరకు పెంచుకోవచ్చు.

Tenor D మొబైల్ 5.2 ఇంచ్ స్క్రీన్ తో 1280 * 720 పిక్సెల్ క్వాలిటీ తో లభిస్తుంది. స్నాప్ డ్రాగన్ 425 ప్రాసెసర్ ద్వారా ఈ మొబైల్ చాల వేగంగా ఆప్స్ ని ఓపెన్ చెయ్యగలుగుతుంది. ఆండ్రాయిడ్ నౌగట్ 7.2 ఆపరేటింగ్ సిస్టం పై ఈ మొబైల్ పని చేస్తుంది. వెనుక వైపు 13 MP , ముందు వైపు 5 MP కెమెరా సామర్థ్యం తో 3,350 mAh బ్యాట్టరీ కెపాసిటీ తో ఈ మొబైల్ లభిస్తుంది.

2 GB + 16 GB వెర్షన్ 4,999 రూపాయలకు, 3 GB + 32 GB వెర్షన్ 5,999 రూపాయలకు లభిస్తుంది. ఆండ్రాయిడ్ ఓరియో కు త్వరలో అప్ డేట్ ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *