Mobile Uncategorized

వినియోగదారులని మోసం చేస్తున్నట్లు ఒప్పుకున్న Apple

ఒక మతాన్ని ఎలా అయితే విశ్వసించే వాళ్ళు ఉంటారో అలానే Apple కంపెనీని కూడా విశ్వసించే అభిమానులు కోట్లల్లో ఉన్నారు . అన్ని కోట్లమంది నమ్మకాలని దెబ్బ తీస్తూ ఎప్పట్నుంచో ప్రచారంలో ఉన్న ఒక వార్త ని Apple ఈరోజు నిజమే అని ఒప్పుకుంది. చాల మంది విమర్శకులు Apple కంపెనీ పాత మోడల్ ఫోన్ లని Apple కంపెనీ కావాలనే నెమ్మదిగా పని చేసేలా చేస్తున్నట్లు ఆరోపించారు. వీటికి సంబంధించి ఎన్నో ప్రూఫ్ లను కూడా చూపించారు. ఫోన్ నెమ్మదిగా పని చేసేలా చేసి అప్పటికి లేటెస్ట్ గా వదిలిన ఫోన్ కొనేలా ప్రేరేపించడానికే అలా చేస్తున్నట్లు అందరు భావించారు.

ఈ ఆరోపణలను Apple కంపెనీ నిజమేనని ఒప్పుకుంది. ఏ ఉద్దేశ్యంతో చేస్తున్నారు అన్నది కచ్చితంగా చెప్పనప్పటికీ వాళ్ళ వాదన ప్రకారం మొబైల్ అనుకోకుండా షట్ డౌన్ అవ్వకుండా నియంత్రించడానికే ఇలా చేస్తున్నట్లు Apple తెలిపింది. కానీ ఇది వినియోగదారులకు ఏ రకంగాను నచ్చని విషయం. ఎందుకంటే అధిక ధర ఉండే ఈ Apple ఫోన్ ఒక్క సారి కొనాడానికే అవస్థలు పడుతుంటే దాన్ని మళ్ళీ కావాలని ఇలా నెమ్మదిగా చెయ్యడం అనేది వినియోగదారులు అస్సలు జీర్ణించుకోలేని విషయం. దీనికి సంబంధించి GeekBench ఆధారాలతో సహా ఇంతకుముందే వీటి గురించి అందరికి తెలియజేసింది. ఇవన్ని జరిగినప్పటికీ Apple  వీటి వెనుక గల ఉద్దేశ్యాన్ని తెలియకపోవడంతో Apple వినియోగదారులు పెద్దగ పట్టించుకోలేదు . కానీ ఇప్పుడు Apple స్వయంగా ఒప్పుకోవడంతో దీనిపై వినియోగదారులు , అభిమానులు మండిపడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *