Apps Cyber Security Uncategorized

మీ మొబైల్ ను నాశనం చేసే కొత్త వైరస్ Loabi

దాదాపుగా ప్రతీ మాల్వేర్ వైరస్ ఎక్కువగా సాఫ్ట్ వేర్ పైనే ఎఫెక్ట్ చూపిస్తాయి .కానీ ఇప్పుడు విస్తరిస్తున్న కొత్త మాల్వేర్ అందుకు భిన్నంగా పని చేస్తూ హార్డ్ వేర్ ని నాశనం చెయ్యడం విశేషం.

Loapi అనే మాల్వేర్ మొబైల్ లోని కంప్యూటింగ్ శక్తి ని తీవ్రతరం చేసి మొబైల్ ఎక్కువగా హీట్ అయ్యేలా చేసి బాటరీ ని ఉబ్బేలా చేస్తుంది. ఇలా మొబైల్ యొక్క హార్డ్ వేర్ ని చాల తక్కువ సమయంలోనే నాశనం చేస్తుంది .

ఈ Loapi అనే మాల్వేర్ ని Monera అనే క్రిప్టో కాయిన్ మైనింగ్ చెయ్యడం కోసం ఉపయోగిస్తారు. ఇలా యూజర్ల మొబైల్ లో మైన్ అయిన కాయిన్ లు హ్యాకర్ (Loapi మాల్వేర్ సృష్టి కర్త) యొక్క అకౌంట్ లో డిపాజిట్ అవుతాయి.

హ్యాకర్లు ఈ Loapi అనే మాల్వేర్ ని ఫేక్ యాంటి-వైరస్ ఆప్ లాగా అలాగే పోర్నోగ్రఫీ ఆప్ లాగా భ్రమించేల చేసి ఇంస్టాల్ చేసుకునేల చేస్తున్నారు.

ఇంస్టాల్ జరిగాక ప్రతీ సారి అడ్మినిస్ట్రేటివ్ హక్కుల కోసం అడుగుతూనే ఉంటుంది. ఆ హక్కులు ఇచ్చేవరకు అడుగుతూనే ఉంటుంది. ఒక్కసారి హక్కులు ఇచ్చాక ఆ ఆప్ తనని తాను యూజర్ కు మెనూ లో ఇక కనిపించకుండా దాచుకుంటుంది.

Loapi మాల్వేర్ కి ఒక్క సారి హక్కులు ఇచ్చాక చాలా ఇబ్బంది పెడుతుంది. మన మొబైల్ లో ఉండే సరైన యాంటి – వైరస్ ఆప్ లని ఫేక్ గ మనల్ని నమ్మించడానికి ప్రయత్నిస్తుంది. వాటిని తీసేయ్యమని సూచిస్తుంది. యూజర్ ని సెట్టింగ్స్ యాక్సెస్ చేసుకోనివ్వకుండా మొబైల్ ని అస్తమాను లాక్ చేస్తుంది . మొబైల్ డేటా మొత్తం డిలీట్ చేస్తా అని హెచ్చరిస్తుంది. ఎన్నో యాడ్ లను చూపిస్తుంది. ఇలా ఎన్నో రకాలుగా తల తింటుంది.

ఈ Loapi మాల్వేర్ కలిగిన ఆప్స్ ప్రస్తుతం అయితే అధికారిక ప్లే స్టోర్ లో లేకుండా ఉండడం కొంచెం ఊరట , కాని బయట యాడ్ ల ద్వారా ఈ ఆప్ ని ఇంస్టాల్ చేసుకోమని కొన్ని వెబ్ సైట్ ల ద్వారా ప్రయత్నిస్తున్నాయి .

ఇలాంటి మాల్వేర్ ల భారిన పడకుండా ఉండాలంటే వీలైనంత వరకు అధికారికి ప్లే స్టోర్ ఆప్ లో ఆప్స్ ఇంస్టాల్ చేసుకోవడం ఉత్తమం.

Vishnu
May Be below average or above average but, not an average guy at all.I strive for tech, philosophy, science, politics, movies and I am sharing my knowledge on tech here.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *