Latest Tech Uncategorized

Kengoro ఒక కొత్త తరహా humanoid రోబో

కొత్త కొత్త రోబోలు గురించి మన రోజు వింటూ ఉంటాం కానీ వాటిలో మానవున్ని పూర్తిగా అనుకరించి ఉండే humanoid రోబోలు మాత్రం చాలా తక్కువ. జపాన్ కి చెందిన శాస్త్రవేత్తలు పూర్తిగా మాననుని కదలికలు ఉండే kengoro అనే ఒక రోబో ని తయారుచేస్తునట్టు Science Robotics అనే రీసెర్చ్ పేపర్ ద్వారా తెలియజేసారు. మానవుని తరహా శరీర నిర్మాణం కలిగి ఉండి చూడడానికి రోబో ల కాకుండా ఒక మానవుని ల కదలికలు ఉండే విదంగా kengoro ని నిర్మిస్తున్నారు. 167 cm ఎత్తు, 56 కేజీల బరువు కలిగి 14 సంవత్సరాల బాలుని ఆధారంగా నిర్మించారు. ప్రస్తుతం రోబోలకు భిన్నంగా మాననుని కండరాల కదలికల నిర్మాణం ఏ విదంగా ఉందొ అదే విదంగా శరీర నిర్మాణం ఉంది. మన కండరాలు ఉపయోగించినపుడు పుట్టిన వేడి తగ్గించడానికి చెమట పడుతుంది అదేసమయంలో విదంగా రోబో లో ఉన్న యంత్రాలు పనిచేసినపుడు వేడెక్కుతాయి ఆ వేడి తగ్గించుటకు ఫ్యాన్ లాంటి వాటిని ఉపయోగిస్తారు అందుకు భిన్నంగా kengoro అస్థిపంజరాని గొట్టల తో నిర్మించారు ఈ గొట్టాలలోకి నీటిని పంపి ఆ వేడిని చల్లరుస్తారు ఒక విదంగా ఇది చమట అని చెప్పొచ్చు. kengoro అధికమైన వంగేగుణము కలిగి ఉండి వివిధ రకల వ్యాయామాలు చేయగలదు. come on you can do it ప్రస్తుతం ప్రయోగ దశలో ఉన్న ఈ రోబో భవిష్యత్తు లో రజినీ కాంత్ రోబో అంతటిది కావాలి అని ఆశిద్దాం.

Dhanu Arjun
A Guy with an extra ounce curiosity on tech, science, Electronics.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *