Mobile Uncategorized

7″ స్క్రీన్ తో Mi Max 3

 

Mi Max 3 మొబైల్ కు సంబంధించి కొన్ని ఆసక్తి కరమైన విషయాలు లీక్ అయ్యాయి . Mi Max సిరీస్ Xiaomi బ్రాండ్ లో ప్రతీ మొబైల్ కు మంచి స్పందన వస్తూనే ఉంది. Mi Max 2 6.44 ” భారీ స్క్రీన్ Phablet తర్వాత అంతకు మించి పెద్దగ ఉండే 7″ స్క్రీన్ తో Mi Max 3 వస్తున్నట్లు CNMO సంస్థ తమ వెబ్ సైట్ లో తెలిపింది. యూజర్లకి అనువుగా ఉండేందుకు 18:9 నిష్పత్తిలో డిస్ ప్లే లో సన్నని అంచులు కలిగి ఉండేలా మొబైల్ రూపొందిస్తున్నట్లు తెలిపింది.

Mi Mix 3 మొబైల్ కు వెనుక వైపున డ్యూయల్ కెమెరా కూడా ఉండబోతుందని CNMO సంస్థ తెలిపింది . Mi Mix 2 లో 5,300 mAh బ్యాట్టరీ కెపాసిటీ ఉంటె ఈ Mi Mix 3 లో 5,500 mAh బ్యాట్టరీ ని ఉంచారు. ఈ మొబైల్ కి క్విక్ ఛార్జ్ ఫీచర్ కూడా ఉండవచ్చు అని తెలిపారు.

Mi Mix 3 యొక్క మెమరీ వివరాలు వెల్లడించలేదు కానీ 3 GB / 4GB RAM ఆప్షన్ లతో 32 GB కనీస అంతర్గత  మెమరీ తో ఈ మొబైల్ విడుదల అవ్వొచ్చు. ఈ మొబైల్ రెండు రకాల ప్రాసెసర్ ల తో విడుదల అవుతుంది . బేసిక్ మోడల్ Snap Dragon 630 తో విడుదల అవుతూ ఉండగా High End మోడల్ Snap Dragon 660 ప్రాసెసర్ తో లభిస్తుంది.

Vishnu
May Be below average or above average but, not an average guy at all.I strive for tech, philosophy, science, politics, movies and I am sharing my knowledge on tech here.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *