Apps Uncategorized

ప్రముఖ హ్యాకర్ Edward Snowden విడుదల చేసిన Haven ఆప్

 

NSA సంస్థకు సంబంధించిన ప్రముఖ హ్యాకర్ Edward Snowden ప్రజల భద్రత కోసం ఒక ప్రత్యేక ఆప్ ను సృష్టించాడు. దీన్నీ ఎవరైనా తమకు కావలసినట్లు ఎడిట్ చేసుకునేందుకు వీలు ఉండేలా Open Source గా అందుబాటులో ఉంచాడు. ఈ Haven ఆప్ ద్వారా ఇంట్లో ఎం జరుగుతుంది అన్నది సింపుల్ గా తెలుసుకోవచ్చు. దీనికి కావాల్సిందల్ల ఒక మొబైల్ (extra) అంతే. ఈ ఆప్ పాకెట్ సైజు లో ఉంటూ మంచి సెక్యూరిటీ సిస్టం గా పని చేస్తుంది.

ఈ ఆప్ ఎలా పని చేస్తుంది అంటే ఈ ఆప్ ను ఇంస్టాల్ చేసి మనం ఏ రూమ్ ని అయితే సురక్షితంగా ఉంచాలో ఆ రూమ్ లో ఉంచాలి.

Haven ఆప్ ఫోన్ లో మైక్రో ఫోన్ ని ఆ రూమ్ లో వస్తున్న శబ్దాలని వింటూ ఉంటుంది. కెమెరా ద్వారా రూమ్ ని పరిశీలిస్తూ ఉంటుంది. ఒక వేల Haven ఆప్ ఇంస్టాల్ చేసిన మొబైల్ ని ఎవరైనా కదిలిస్తూ ఉంటే Accelarometer ద్వారా కదలికల్ని గమనిస్తూ ఉంటుంది .పవర్ మానిటర్  ద్వారా మొబైల్ ఛార్జ్ అవుతుందా లేదా అన్నది కూడా ఆ మొబైల్ ద్వారా తెలుస్తుంది. ఈ వివరాలన్నీ ఎవరైనా అపరిచితుడు ఎంటర్ అవ్వగానే ఈ వివరాలన్నీ ఆ ఆప్ ఇంస్టాల్ చేసిన వ్యక్తి సొంత మొబైల్ కి వివరాలు వెళ్తూ ఉంటాయి. ఈ వివరాలన్నీ సిగ్నల్ అనే మెస్సేజింగ్ ఆప్ ద్వారా చాల సురక్షితంగా సెండ్ అవుతాయి . ఇలా అప్ డేట్స్ ఏమి అవసరం లేదు అనుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు Tor బ్రౌజర్ ద్వారా చెక్ చేసుకోవచ్చు లేదా Haven మొబైల్ లో నే చెక్ చేసుకోవచ్చు.

Haven ను ఇక్కడ డౌన్ లోడ్ చేసుకోవచ్చు : http://bit.ly/2D38cYn

Vishnu
May Be below average or above average but, not an average guy at all.I strive for tech, philosophy, science, politics, movies and I am sharing my knowledge on tech here.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *