Cyber Security Uncategorized

(New Update) ట్విట్టర్ ఖాతా తొలగించుకున్న Wiki Leaks వ్యవస్థాపకుడు Julian Assange

 

(Update 26-12-2017 : Julian Assange ట్విట్టర్ అకౌంట్ మల్లి అందుబాటులోకి వచ్చింది. ఎం జరిగింది అన్న విషయాలపై ఎలాంటి సమాచారం లేదు)

Wiki leaks వెబ్ సైట్ ద్వారా  ఎన్నో స్కాం లను, ప్రభుత్వంలో గుట్టుగా జరుగుతున్న ఎన్నో విషయాలను ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తుల కంప్యూటర్ లు హ్యాక్ చెయ్యడం ద్వారా సంపాదించి ఏ మాత్రం దాపరికం లేకుండా డాక్యుమెంటెడ్ రుజువులతో సహా బయటపెట్టి సంచలనం సృష్టించిన ప్రముఖ హ్యాకర్ జూలియన్ అస్సాంజే (Julian Assange) తన ట్విట్టర్ ఖాతా @JulianAssange డిలీట్ చేస్కున్నట్లుగా తెలుస్తోంది. ఇలా చేయ్యబోతున్నట్లు ఎం తెలియజేయకుండానే డిలీట్ చేసెయ్యడం గమనార్హం. ట్విట్టర్ అకౌంట్ కోసం ప్రయత్నించిన వారికి కింది ఫోటోలో చూపించినట్లుగా చూపిస్తుంది.

Twitter కంపెనీ సస్పెండ్ చేసిందా లేక జూలియన్ అస్సంజే నే డిలీట్ చేసుకున్నాడ లాంటి విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది. వికీ లీక్స్ కు సంబంధించిన ట్విట్టర్ ఖాతా అందుబాటులోనే ఉంది కేవలం Julian Assange అకౌంట్ మాత్రమే కనిపించడం లేదు . దీనికి సంబంధించి ట్విట్టర్ కాని వికీ లీక్స్ కాని ఇప్పటివరకు ఎటువంటి సమాచారం వెల్లడించలేదు.

Julian Assange ఇంకో అకౌంట్ గా భావిస్తున్న ట్విట్టర్ ఖాతా మాత్రం త్వరలో Julian Assange విడుదల చెయ్యబోయే భారీ లీక్ ను ఉహించి ట్విట్టర్ సంస్థ Julian Assange అకౌంట్ తొలగించినట్లు ట్విట్టర్ లో ఉంచారు. ఈ ఇంకో అకౌంట్ నిజంగా జూలియన్ అస్సాంజే నే ఉపయోగిస్తున్నాడా అన్న విషయాలేవీ ఇంకా స్పష్టం కాలేదు.

 

Vishnu
May Be below average or above average but, not an average guy at all.I strive for tech, philosophy, science, politics, movies and I am sharing my knowledge on tech here.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *