Mobile Uncategorized

One Plus 5 కి కూడా రాబోతున్న Face Unlock ఫీచర్

OnePlus5 కి అలాగే OnePlus5T కి పెద్దగా ఫీచర్లలో తేడా లేనప్పటికీ రెండు ఒకే ధరకి లభించడం OnePlus5 లో ఫేస్ ద్వారా అన్ లాక్ చేసే ఫీచర్ లేకపోవడం OnePlus5 వినియోగదారులని నిరాశ పరిచిన విషయం వాస్తవం. OnePlus నుంచి OnePlus3 దాక ప్రతీ మొబైల్ ని ఎక్స్చేంజి ద్వారా తీసుకోడానికి ఆమోదించారు కానీ OnePlus5 మొబైల్ ని మాత్రం ఎక్స్చేంజి కోసం ఉంచకపోవడం OnePlus అభిమానులని భారీగా నిరాశ పరిచింది. దీంతో OnePlus కంపెనీ ఈ విషయాన్ని గుర్తించి ఈ ఫేస్ అన్ లాక్ అప్ డేట్ వాడులుతున్నట్లు తెలుస్తుంది.

OnePlus5 లో త్వరలో ఈ అప్ డేట్ తీసుకు వస్తున్నట్టు OnePlus కంపెనీ సీఈఓ Carl Pei తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలిపాడు. ప్రజలు ఈ ఫీచర్ ని ఎక్కువగా అడుగుతున్నట్లు పేర్కొని ఈ అప్ డేట్ ని తీసుకువస్తున్నట్లు వెల్లడించాడు. OnePlus5T లో ఉన్న ఈ ఫీచర్ చాల వేగవంతం మరియు సౌకర్యంగా ఉన్నప్పటికీ మరీ అంత సురక్షితమైనది మాత్రం కాదు. ఎందుకంటే ఈ మొబైల్ ని స్పూఫ్ చెయ్యడం ద్వారా అన్ లాక్ చెయ్యడం జరిగింది . OnePlus5T లో ఈ ఫీచర్ మాత్రమే కాకుండా ఫింగర్ ప్రింట్ అన్ లాక్ కూడా ఉంచడం వల్ల ఇదేమి అంత పెద్ద సమస్య అయితే కాదు. Carl Pei ఎప్పట్లోపు ఈ ఫీచర్ అప్ డేట్ వస్తుంది అన్న విషయాలేవీ తెలుపలేదు.

Vishnu
May Be below average or above average but, not an average guy at all.I strive for tech, philosophy, science, politics, movies and I am sharing my knowledge on tech here.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *