వాట్సాప్ instant messaging సర్వీస్ గా మొదలై SMS సర్వీస్ ని ఎవరు ఉపయోగించనంతగా అభివృద్ధి చెందింది. వాట్సాప్ ని ఫేస్ బుక్ సంస్థ 19 బిలియన్ డాలర్ లకు కొన్నది. కొన్న తరువాత ఫేస్ బుక్ వాట్సాప్ ద్వారా ఆదాయ మార్గాలు అన్వేషించే భాగంగా వాట్సాప్ బిజినెస్ పేరిట కంపెనీలకు కూడా అకౌంట్ లను కేటాయించాలని భావిస్తుంది.
ఇందులో భాగంగానే యూజర్ల వైపు నుంచి కూడా ఆప్ కు ఎన్నో కొత్త ఫీచర్లు తీసుకు రావడానికి సహకరించని బ్లాక్ బెర్రీ, విండోస్ OS లలోని కొన్ని మోడల్ లకు వాట్సాప్ అప్ డేట్ ను నిలిపివేస్తున్నట్లు వాట్సాప్ ప్రకటించింది. బ్లాక్ బెర్రీ 10 OS అలానే విండోస్ 8 OS లపై పనిచేసే మోడల్ లకు వాట్సాప్ ను నిలిపివేస్తున్నట్లు తెలిపింది. Nokia s40 మోడల్ లకు మాత్రం డిసెంబర్ 2018 వరకు సపోర్ట్ చేసేలా ఉంచుతున్నట్లు తెలిపింది. ఆండ్రాయిడ్ లో కూడా కనీసం ఆండ్రాయిడ్ 4.0 + ఉంటేనే వాట్సాప్ సపోర్ట్ అవుతుందని స్పష్టం చేసింది.
ప్రస్తుతానికి ఒక OS మొబైల్ నుంచి ఇంకో OS మొబైల్ కు చాట్ హిస్టరీ ట్రాన్స్ ఫర్ చేసుకునే సదుపాయం లేదు. అంటే ఒక రకంగా వేరే OS మొబైల్ కు అప్ గ్రేడ్ అయ్యేలా ఉంటే చాట్ హిస్టరీ పోగొట్టుకోవాల్సిందే. ఈమెయిల్ రూపంలో చాట్ హిస్టరీ సేవ్ చేసుకునే సదుపాయం మాత్రం ఉంది.