Latest Tech Uncategorized

అందరికి ఉచితంగా అందుబాటులోకి రానున్న Apple Lisa.

 

Apple కంపెనీ ద్వారా రూపొందిన మొదటి GUI కంప్యూటర్ LISA ఎవ్వరికి తెలిసుండకపోవచ్చు. అప్పట్లో బాగా విజయవంతమైన ఈ కంప్యూటర్ యొక్క ఆపరేటింగ్ సిస్టం (LISA) ని కంప్యూటర్ హిస్టరీ మ్యూజియం సంస్థ త్వరలో అందరికి అందుబాటులో ఉండేలా ఉచితంగా ఉంచనుంది. దీంతో LISA ఆపరేటింగ్ సిస్టం ని ఎవరికీ కావలసినట్టు వాళ్ళు మార్చుకోవచ్చు. Al Cossow (software Curater @computer history museum) ఈ lisa ఆపరేటింగ్ సిస్టం ని అందులోని అప్లికేషన్ ల యొక్క కోడ్ ని దాదాపుగా రికవర్ చేసినట్లు, దానిని Apple ద్వారా రివ్యూ చేయించాక అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపాడు.

అప్పట్లో బిల్ గేట్స్ కి , స్టీవ్ జాబ్స్ కి ఒక విషయం లో వచ్చిన అభిప్రాయ భేదం కారణం గా, Apple ఇంజినీర్లు అప్పటికే కొద్ది మొత్తం లో GUI ఇంటర్ఫేస్ విభాగంలో వృద్ది సాధించిన Xerox parc lab కు వెళ్లారు . అక్కడ Xerox lab వాళ్ళకి Apple లో కొన్ని షేర్ లు ఇవ్వడం ద్వారా Xerox సిస్టం యొక్క కోడ్ పరిశీలించడానికి మూడు రోజుల అవకాశం దొరికింది. Apple ఇంజినీర్లు ఆ మూడు రోజుల్లో Xerox యొక్క కోడ్ ద్వారా నేర్చుకున్న దాంతో ఈ LISA ను తయారు చేసారు.

 

LISA మొట్ట మొదటి మౌస్ ద్వారా ఆపరేట్ చెయ్యగలిగిన కంప్యూటర్. దీని ధర 25,000 డాలర్లు. బిల్ గేట్స్ విండోస్ ఆపరేటింగ్ సిస్టం తోనే GUI కంప్యూటర్ లు తయారు చెయ్యడంతో Steve Jobs, బిల్ గేట్స్ ని అప్పట్లో తమ సాంకేతికత ని దొంగిలించినట్లు ఆరోపించాడు. దీనికి సమాధానంగా బిల్ గేట్స్ “నేను దొంగిలించాలనుకున్నసాంకేతికత కోసం వెళితే నా కంటే ముందే మీరు దొంగిలించారు” అన్నాడు. LISA అంటే Local Integrated System Architecture అని జాబ్స్ చెప్పినప్పటికీ తరువాతి ఇంటర్ వ్యూ లలో అది తన కూతుర్ని(Lisa Nicole Brennan) ఉద్దేశించి పెట్టినట్లు ఒప్పుకున్నాడు . ఏదేమైనప్పటికీ త్వరలో మనం LISA ఆపరేటింగ్ సిస్టం తో ఆడుకోవచ్చు.

Vishnu
May Be below average or above average but, not an average guy at all.I strive for tech, philosophy, science, politics, movies and I am sharing my knowledge on tech here.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *