Latest Tech Uncategorized

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం లాంచ్ చేసిన Fiber Net – అత్యంత చౌకగా ఇంటర్నెట్, టీవీ ఛానళ్ళు, మరెన్నో.

ఆంధ్రప్రదేశ్ లో ఎప్పట్నుంచో అనుకుంటున్న తక్కువ ధరలో ప్రతీ ఇంటికి ఇంటర్నెట్ ని అందించే ప్రయత్నంలో భాగంగా ఫైబర్ గ్రిడ్ ని ఏర్పాటు చెయ్యాలనుకున్న ఆంధ్ర ప్రభుత్వం యొక్క ప్రయత్నం దాదాపుగా పూర్తయి నిన్ననే రాష్ట్రపతి ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది. ఈ ఫైబర్ నెట్ ద్వారా అతి తక్కువ ధరలో ప్రజలు ఇంటర్నెట్ ను పొందవచ్చు. 15 Mbps వేగంతో 5GB వరకు ఉండేలా 149 రూపాయల ప్లాన్ అన్ని ప్లాన్ లలోకేల్ల తక్కువ ధర కలిగినది. 5 GB తరువాత నుంచి 1 Mbps స్పీడ్ లభిస్తుంది. మిగతా ప్లాన్ లు కింద ఫోటోలో చూడొచ్చు.

Fiber Net మాత్రమే కాకుండా అదే ధరలో 250 టీవీ ఛానల్ లని కూడా సెట్ టాప్ బాక్స్ ద్వారా అందిస్తుంది. టెలిఫోన్ సౌకర్యాన్ని కూడా ఈ సర్వీస్ ద్వారా పొందవచ్చు. సాధారణంగా మనం ఇంట్లో టీవీ కొరకు కనీసం 120 రూపాయలు ఇంట్లో ఇంటర్నెట్ కోసం కనీసం తక్కువలో తక్కువగా 200 రూపాయలు వెచ్చిస్తాం. ఈ ప్రభుత్వ ప్యాకేజ్ తో కేవలం 149 కే మనం ఈ సర్వీస్ లు అన్ని పొందవచ్చు. ఫైబర్ నెట్ ద్వారా టీవీ లో ఉంటె అడిషనల్ ఫీచర్లు ఏంటంటే టీవీ లోనే సెట్ టాప్ బాక్స్ ద్వారా నెట్ బ్రౌజ్ చెయ్యడం , గేమ్స్ ఆడడం చెయ్యవచ్చు. మీరు పైన ఇచ్చిన వీడియో పరిశీలిస్తే ఇంటర్నెట్ మాత్రమే కాకుండా ఇంకా ఎం ఎం చెయ్యవచ్చో అర్థమవుతుంది.

ఈ ఫైబర్ నెట్ గ్రిడ్ దాదాపుగా ప్రతీ జిల్లాలోను అందుబాటులో ఉంది. మీకు దగ్గరలో ఉందొ లేదో తెలియాలంటే ఈ లింక్ ను సందర్శించడం ద్వారా తెలుసుకోవచ్చు . కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకుంటే ఈ లింక్ ద్వారా చేసుకోవచ్చు. ఇంటర్నెట్ ప్లాన్ లు 149, 399, 599 (Home Plans) అలాగే 999,1499 ,2499 (institutions/business) లకి అందుబాటులో ఉన్నాయి. పూర్తి ప్లాన్ వివరాలు కింది చిత్రంలో చూడవచ్చు.

Vishnu
May Be below average or above average but, not an average guy at all.I strive for tech, philosophy, science, politics, movies and I am sharing my knowledge on tech here.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *