Apps Uncategorized

WhatsApp అనుకోకుండా వదిలిన Private Messaging ఫీచర్

 

WhatsApp ఈ మధ్యన వరుసగా చాలా ఫీచర్లు తీసుకువస్తుండడం తెలిసిందే. ఆ కోవలోనే whatsapp గ్రూప్ ల కు సంబంధించిన త్వరలో తీసుకురావలనుకుంటున్న ఫీచర్ ని అనుకోకుండా whatsApp విడుదల చేసింది. మల్లి వెంటనే ఇంకో అప్ డేట్ లో ఆ ఫీచర్ ని తీసేసింది. WhatsApp గ్రూప్ లకు సంబంధించి గ్రూప్ కాన్ఫరెన్స్ కాల్స్ ఫీచర్స్ ని తీసుకు రానున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి ఎన్నో ఫీచర్లలో ఒకటైన WhatsApp గ్రూప్ ప్రైవేటు మేస్సజింగ్ ఫీచర్ ని అనుకోకుండా విడుదల చేసి మల్లి తీసేసింది.

ఈ గ్రూప్ ప్రైవేటు మెస్సేజింగ్ ఫీచర్ ద్వారా గ్రూప్ లోనే ఉంటూ అందులోని సభ్యులు వేరే వ్యక్తులతో ప్రైవేటు గా మాట్లాడుకోవచ్చు. ఈ మెసేజ్ లు గ్రూప్ చాట్ లోనే ఉంటూ కేవలం ఏ వ్యక్తికి అయితే ఆ మెసేజ్ ప్రైవేటు గా పంపించారో ఆ వ్యక్తి మాత్రమే దానిని చూడగలుగుతాడు. WhatsApp ఈ ఫీచర్ ని మల్లి వెంటనే ఇంకో అప్ డేట్ లో తొలగించినట్లు సమాచారం. ఈ అప్ డేట్ బీటా యూజర్లకు అని కాకుండా నార్మల్ యుజర్లకే వదిలినట్లు సమాచారం. దీన్ని బట్టి అర్థమవుతున్నదేమిటంటే ఈ ఫీచర్ ఇంకా పరిశీలనలో ఉండగా ఎదో ప్రోగ్రామింగ్ లో జరిగిన పొరపాటు వలన వదిలినట్లు సమాచారం.

Vishnu
May Be below average or above average but, not an average guy at all.I strive for tech, philosophy, science, politics, movies and I am sharing my knowledge on tech here.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *