Latest Tech Uncategorized

2017 లో బాగా పాపులర్ అయిన టెక్నాలజీ ట్రెండ్స్ – Top 10 Tech Trends in India

 

టెక్ కి సంబంధించి 2017 లో భారీ గా మార్పులు వచ్చాయి. ఇంటర్నెట్ దాదాపుగా అందరికి అందుబాటులోకి వచ్చింది . స్మార్ట్ ఫోన్ ని ఎక్కువమంది కొని/వాడే పరిస్థితికి టెక్నాలజీ వచ్చేసింది. ప్రతీది మన ఇంటి నుంచే సర్వీస్ పొందేలా ఎన్నో ఆప్స్ తెరంగ్రేటం చేసాయి. భారత ప్రభుత్త్వం చేపట్టిన డిజిటల్ ఇండియా ప్రజలని టెక్నాలజీ వైపు ఆకర్షితులయ్యేలా చేసింది. మన ఆంధ్ర ప్రదేశ్ లో ఈ గవర్నెన్స్ ఆప్స్ ద్వారా ప్రజలని టెక్నాలజీ కి చేరువ చెయ్యడంలో ఆంధ్ర ప్రభుత్వం తమదైన పాత్ర పోషించింది .అన్ని రకాలుగా టెక్నాలజీ విషయంలో ఈ 2017 వ సంవత్సరం ప్రజలను టెక్నాలజీ వైపు అడుగులు వెయ్యడానికి అవకాశాలను ఏర్పరచింది. 2017 కొద్ది రోజులలో ముగియబోతుంది కాబట్టి ఈ సందర్భంగా మనం ఈ సంవత్సరం బాగా పాపులర్ అయిన టెక్ ట్రెండ్స్ గురించి తెల్సుకుందాం. ప్రపంచవ్యాప్తంగా అలాగే ముక్యంగా ఇండియా/ఆంధ్ర ప్రదేశ్ లో ప్రభావితం చేసిన టెక్ ట్రెండ్స్ గురించి తెలుసుకుందాం.

Jio

జియో 2016 లో నే మొదలైనప్పటికి 2017 లో జియో వినియోగం పీక్స్ కి చేరింది. 2017 లో జియో 15 రూపాయల లో మొబైల్ ను తీసుకువచ్చి 4G ని అందరికి అందుబాటులోకి తీసుకువచ్చి టెలికాం రంగంలోనూ , ఇంటర్నెట్ వ్యాపారాల లోను ఎన్నో కొత్త అవకాశాలను తీసుకురావడం మాత్రమే కాకుండా టెలికాం రంగంలో జియో స్థానాన్ని నెంబర్ వన్ గా చేర్చింది. ఇండియాలో ఇంటర్నెట్ వాడే యూజర్లు అప్పటివరకు ఇతర దేశాలతో పోల్చితే తక్కువగా ఉండగా జియో రాకతో అది తార స్థాయికి చేర్చడమే కాకుండా సగటు ఇంటర్నెట్ వేగం ని కూడా జియో మెరుగు పరచడం విశేషం. జియో ద్వారా ఇంటర్నెట్ వినియోగం పెరగడం వల్ల ఇంటర్నెట్ బేస్ చేసుకుని ఉన్న వ్యాపారాలు ఈ 2017 లో భారీగా వృద్ది చెందాయి. వాటిని మీరు కింద ఉన్న ఇంకా కొన్ని టెక్ ట్రెండ్స్ లో చదవొచ్చు.

Youtube & Facebook Video Market

జియో ఎఫెక్ట్ యే అని చెప్పలేను కాని కచ్చితంగా ఇంటర్నెట్ ISP రూపంలోనూ , సిమ్ కార్డు ద్వారా ఇలా చాల రూపాలుగా అందరికి అందుబాటులోకి రావడంతో వీడియో మార్కెట్ పెరగడం ఈ సంవత్సరం గమనించాల్సిన విషయం. Youtube లో ఈ సంవత్సరం ముందు వరకు పెద్దగ youtube వీడియో మార్కెట్ పెద్దగ లేకపోవడం తో YouTube సంస్థ కేవలం 1,000 వ్యూ ల పై నుంచే ads ద్వారా అమౌంట్ ఇచ్చేది . దాన్ని 10,000 వ్యూ లకు 2017లో పెంచి అమౌంట్ ఇవ్వడం కాపీ రైట్ క్లెయిమ్ లలో కృత్రిమ సాంకేతికతను అనుసరించడం జరిగింది. ఈ ఇంటర్నెట్ విస్తృతిని మార్కెట్ గా చేసుకుని ఎందఱో వీడియో క్రియేటర్ లు ఈ వీడియో నిర్మాణ రంగంలోకి ప్రవేశించారు . సినిమా నిర్మాతలు కూడా అంతకు ముందులా CD లు వదలడం మానేసి అమెజాన్ ప్రైమ్ , youtube , నెట్ ఫ్లిక్స్ లాంటి సంస్థలకు హక్కులు అమ్మేయ్యడం మొదలెట్టాయి. Facebook లో కూడా 2017 కు ముందు వరకు ads వీడియో లలో ads వెయ్యడం కానీ , వీడియో పెట్టినవల్లకు డబ్బులు ఇవ్వడం కానీ లేదు. కానీ ఇప్పుడు ads వేస్తుంది అలాగే వీడియో లలో వచ్చే ads ద్వారా వచ్చిన డబ్బుల్లో కొంత వాటిని పెట్టినవాళ్ళకి ఇవ్వడం మొదలెట్టింది.

Artificial Intelligence

2017 సంవత్సరంలో కృత్రిమ సాంకేతికత వాడకం అలాగే భవిష్యత్ అవసరాల కోసం పరిశోదన చాల ఎక్కువగా జరగడం మొదలయ్యింది. కృత్రిమ సాంకేతికత ని ప్రజా అవసరాలలో చొప్పించే అవకాశాలున్న ప్రతీ చోట ఈ కృత్రిమ సాంకేతికత కు సంబంధించిన కంపెనీలు ఏర్పడడమే కాకుండా వాటిపై పరిశోధనలను ఇప్పటికే ఉన్న గూగుల్ , మైక్రో సాఫ్ట్ లాంటి సంస్థలతో కొనసాగించడానికి కృషి చేస్తున్నాయి. గూగుల్ చాల పనుల్లో కృత్రిమ సాంకేతికతను ఉపయోగిస్తుండడం తెలిసిందే. గూగుల్ లో ముఖ్యంగా గూగుల్ అసిస్టెంట్ ద్వారా యూజర్ల దైనందిన జీవితంలో అవసరమయ్యే పనులని వాయిస్ ద్వారా గూగుల్ అసిస్టెంట్ చెయ్యడం కృత్రిమ సాంకేతికత అభివృద్ధికి ఒక నిదర్శనం . కొద్ది నెలల క్రితమే కృత్రిమ సాంకేతికత ఆధారంగా మాట్లాడే రోబో ని తయారు చేసిన సౌదీ కంపెనీ దాన్ని విలేఖరుల సమావేశంలో మాట్లాడించారు. కృత్రిమ సాంకేతికత పూర్తిగా సిద్దమయితే కొద్ది రోజుల్లో మనుషులు చేసే పనులన్నిటిని కంప్యూటర్ లే చెయ్యవచ్చు.

Virtual Reality & Augmented Reality

ఎంటర్ టైన్ మెంట్ విభాగం లో ఈ సంవత్సరం వచ్చిన కొత్త ట్రెండ్ వర్చ్యువల్ రియాలిటీ. ఎంటర్ టైన్ మెంట్ మాత్రమే కాకుండా ఎడ్యుకేషన్ పరంగా కూడా వర్చ్యువల్ రియాలిటీ ఉపయోగపడింది . వర్చ్యువల్ రియాలిటీ ని ఆధారం చేసుకుని ఎన్నో గేమ్ లు , బాహుబలి మేకింగ్ వీడియో వదలడం , వీడియో లు తాయారు చెయ్యడం , స్టీవెన్ స్పీల్ బెర్గ్ ఈ టెక్నాలజీ కథాంశం గా చేసుకుని ఒక పూర్తి సినిమానే తియ్యడం లాంటివి ఈ సంవత్సరం టెక్నాలజీ విషయంలో వర్చ్యువల్ రియాలిటీ తీసుకొచ్చిన ట్రెండ్.

ఇక Augmented రియాలిటీ విషయానికి వస్తే ఈ టెక్నాలజీ చాల పెద్ద పెద్ద కంపెనీ లను ఆకర్షించింది. ఈ టెక్నాలజీ ద్వారా వచ్చిన Pokemon Go గేమ్ ప్రపంచ వ్యాప్తంగా ఎంత ఉర్రూతలుగించిందో మీ అందరికి తెల్సిందే. Augmented రియాలిటీ లో కెమెరా ద్వారా చూస్తూనే అక్కడ లేని ఒక వస్తువుని/మనిషిని కాని ఉంచేలా చెయ్యవచ్చు . ఈ టెక్నాలజీ హోం డెకరేషన్ రంగం ఇప్పటికే వినియోగించుకుని మీ ఇంట్లో తమ ఫర్నిచర్ ఏదైతే బాగుంటుందో అన్నది చూసుకునేలా ఆప్ తీసుకుని వచ్చింది. ఇలా ఎన్నో రకాలుగా Augmented రియాలిటీ ఈ సంవత్సరం ట్రెండ్ ఐంది.

Bit Coin (Crypto Currency)

బిట్ కాయిన్ ప్రపంచ వ్యాప్తంగా ఈ సంవత్సరం దాదాపుగా 1700 % అభివృద్దితో వార్తల్లో నిలిచింది. 2012 లోనే మొదలయిన బిట్ కాయిన్ ఈ 2017 లోనే ఎవ్వరు ఉహించనంతగా విలువ పెరగడం ద్వారా వార్తల్లో నిలిచి అందరి దృష్టిని ఆకట్టుకుంది. దీని ప్రభావంతో మిగతా క్రిప్తో కరెన్సీ ల విలువ కూడా పెరగడం గమనార్హం. బిట్ కాయిన్ విలువ 2013 లో 0.13 డాలర్లు గా ఉంటే 2017 లో 19,500 డాలర్లకు చేరుకొనిండి. ఇప్పుడు మళ్ళీ తగ్గిపోయి 13,000 – 16,000 డాలర్ల మధ్య కొట్టు మిట్టాడుతూ ఉంది. బిట్ కాయిన్ ఎన్నో ఆవిష్కరణలకు మున్ముందు కేంద్ర బిందువు అయ్యే అవకాశాలు చాల ఉన్నాయి. బిట్ కాయిన్ కాకుండా క్రిప్తో కరెన్సీ లలో ఎక్కువగా ప్రాముక్యం పొందినవి ఈతీరియం అలాగే లైట్ కాయిన్. ఈ రెండు కూడా 400 % పైగా అభివృద్దిని ఈసంవత్సరం కనబరిచి వార్తల్లో నిలిచాయి.

Self Driving Vehicles

ఈ సంవత్సరం సెల్ఫ్ గా డ్రైవింగ్ చేసుకునే కార్ లు రూపొందించడంలో టెస్లా , గూగుల్ వంటి కంపెనీ లు పురోగతి సాధించి రోడ్ లపై వాటిని కొన్ని దేశాలలో అనుమతించడం కూడా జరిగింది. ఇవి కూడా పూర్తిగా ఆటోమేటెడ్ అవ్వలేకపోయినప్పటికి త్వరలో పూర్తిగా ఆటోమేటెడ్ అయ్యే అవకాశాలకు బాటలు ఈ సంవత్సరమే పడ్డాయి అనొచ్చు. ప్రస్తుతం ఎవరో ఒక వ్యక్తి కార్ లో ఉంటె తప్ప ఈ సెల్ఫ్ డ్రైవ్ కార్ లు సొంతంగా డ్రైవ్ చెయ్యవు . అలా ఎవ్వరు లేకుండా సొంతంగా డ్రైవ్ చెయ్యకుండా ఉండేలా ప్రస్తుతం ఈ కార్ సాఫ్ట్ వేర్ ని రూపొందించారు. ఎవరైనా ఉంటె మాత్రం కార్ సొంతంగా డ్రైవ్ చెయ్యగలదు వ్యక్తి యొక్క ఆదేశాల అనుసారం. వీటికి మన భారత దేశంలో అనుమతి లభించకపోవడం కించిత్ బాధాకరం.

Elon Musk

Elon Musk ఈ సంవత్సరం తమ కంపెనీలు అయిన Hyperloop, బోరింగ్ , Space X, Tesla ల ఉత్పత్తుల వల్ల అలాగే కృత్రిమ సాంకేతికత విషయమై జుకర్ బెర్గ్, Elon Musk కు మధ్య వచ్చిన మాటల వల్ల ఈ సంవత్సరం వార్తల్లో నిలిచాడు. Hyperloop కంపెనీ ద్వారా మనుషుల ప్రయాణాన్ని సులభం చేసే ప్రాజెక్ట్ పనులకై ఆంధ్ర , కర్ణాటక , మహారాష్ట్ర ప్రభుత్వాలతో MoU లు చేయించుకోవడం ద్వారా మన దేశంలో వార్తల్లో నిలిచాడు. బోరింగ్ కంపెనీ మొదటి ట్రయిల్ రన్ ఈ సంవత్సరం చేసి ఆసక్తికరమైన ఫలితాలు రావడంతో ప్రపంచ వ్యాప్తంగా వార్తల్లో నిలిచాడు. SPace X కంపెనీ 12 వ రాకెట్ ని రెండు వారాల కిందటే విజయవంతంగా పంపించడం ద్వారా వార్తల్లో నిలిచాడు. Tesla Roadster ని మార్కెట్ లో లాంచ్ చెయ్యడం ద్వారా మల్లి ఈ సంవత్సరం ట్రెండ్ గా మారాడు.

Cyber Security

ఈ సంవత్సరం ఇంటర్నెట్ సెక్యూరిటీ పరంగా చాల సంస్థ లు హ్యాకింగ్ బారిన పడ్డాయి. చాల మంది సైబర్ క్రిమినల్స్ ఈ సంవత్సరం చెలరేగిపోయారు. ముక్యంగా Wanna Cry ransom ware అలాగే , Petya ransom ware ఏకంగా చాల దేశాలలో కంప్యూటర్ లను అఫెక్ట్ అయ్యేల చేసాయి . Wannacry ద్వారా హ్యాకర్ లు కొన్ని మిలియన్ డాలర్లు సంపాదించారు. Petya ద్వారా కొంత సంపాదించినప్పటికీ ఆ ransome ware ఫైల్స్ తిరిగి డీ క్రిప్ట్ చెయ్యకపోవడం తో చాల మంది డేటా కోల్పోయారు. ఇవే కాకుండా BitCoin ఎక్స్చేంజి అయిన Youbit పై ఈ సంవత్సరంలో రెండు సార్లు హ్యక్ జరగడంతో ఆ కంపెనీని దివాలా తీస్తున్నట్లు తెలిపారు. సైబర్ సెక్యూరిటీ పరంగా చాలా కంపెనీలు ఈ సంవత్సరంలో ఏర్పడ్డాయి.కృత్రిమ సాంకేతికత మున్ముందు ఎక్కువగా ఉపయోగించే అవకాశాలు ఉండడంతో సైబర్ సెక్యూరిటీ పరంగా చాలా కంపెనీలకు అవకాశాలు మున్ముందు ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి.

Digital Payments

మన దేశంలో డిజిటల్ పేమెంట్స్ పరంగా 2016 భారత ప్రభుత్వం తీసుకు వచ్చిన నోట్ల రద్దు ఎంతో ఉపయోగపడింది. అప్పటికే డిజిటల్ పే మెంట్ల రంగంలో ఉన్న paytm సంస్థ కి ఈ అవకాశం ఎంతగానో కలిసొచ్చింది. Flipkart , Amazon లాంటి సంస్థలు కూడా సొంత వాల్లెట్ లను తీసుకు వచ్చాయి. Google కూడా ఈ సంవత్సరంలో తీసుకువచ్చిన Tez ఆప్ డిజిటల్ పేమెంట్ రంగంలో ప్రస్తుతం హల్ చల్ చేస్తూ ఉంది. దాదాపుగా చాలా ఆఫ్ లైన్ స్టోర్ లు కూడా డిజిటల్ పేమెంట్ లని కూడా స్వాగతించడం తో Digital Payments వ్యాపారం చేస్తున్న సంస్థలకు ఈ సంవత్సరం మరపురానిది అని చెప్పవచ్చు.

ఇంకేమైనా 2017 లో టెక్ ట్రెండ్స్ ఉంటె మీరు కామెంట్ ద్వారా తెలుపగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *