Jio ,Airtel ప్లాన్ ల లాగానే Idea కూడా తమ తక్కువ ధర ప్లాన్ ని ప్రకటించింది. ఈ ప్లాన్ తో అపరిమిత కాల్స్ అలాగే 1GB డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ కి కేవలం 10 రోజుల గడువు మాత్రమే ఉంటుంది. Idea ప్లాన్ 93 రూపాయలకే లభిస్తుంది. Jio కు సంబంధించి 14 రోజుల గడువుతో 98 రూపాయల ధరలో లభిస్తుంది. Airtel కు సంబంధించి 10 రోజుల గడువుతో 93 రూపాయల ధరలో లభిస్తుంది.
Idea Cellular వెబ్ సైట్ ప్రకారం ఈ 93 రూపాయల ప్లాన్ 1GB 3G డేటా మరియు అపరిమిత కాల్స్ ఎలాంటి మెసేజ్ లు లేకుండా లభిస్తుంది. అపరిమిత కాల్స్ అంటే కేవలం 250 నిమిషాలు ఒక రోజుకి మరియు 1,000 నిమిషాలు ఒక వారానికి మాత్రమే లభిస్తాయి. ఆ పైన ప్రతే కాల్ సెకండ్ కి ఒక పైసా చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. Jio లో ఇలాంటి ఏ హద్దులు ఉండవు.
ఈ 93 రూపాయల ప్యాక్ కొన్ని ఐడియా నెంబర్ లకి మాత్రమే చూపిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ ప్లాన్ రీచార్జి చేసుకునే ముందు ఒక సారి ఐడియా వెబ్ సైట్ లో చెక్ చేసుకుని రీచార్జి చేసుకోవడం బెటర్.
ఒక వారానికి ముందే Airtel కూడా 93 రూపాయల ప్లాన్ ని విడుదల చేసింది. ఈ ప్లాన్ లో 100 sms లని ప్రతీ రోజు అందిస్తుంది. ఐడియా లాగే అపరిమిత కాల్స్ 250 నిమిషాలకి పరిమితం చేస్తూ , 10 రోజులకి 1 GB డేటా ని ఈ ప్లాన్ అందిస్తుంది.