కేవలం కొన్ని హై ఎండ్ స్మార్ట్ ఫోన్ లలో మాత్రమే ప్రస్తుతం అందుబాటులో ఉన్న PORTRAIT MODE ఫీచర్ ఇతర మొబైల్ లలో కూడా ఉపయోగించవచ్చు. గూగుల్ పిక్సెల్, One Plus, ఆపిల్ లాంటి కొన్ని మోడల్ లలో మాత్రమే లభించే ఈ ఫీచర్ ఇప్పుడు ఇతర మొబైల్ లలో కూడా CAMERA NX అనే ఆప్ ద్వారా ఉపయోగించవచ్చు. ఈ ఆప్ ద్వారా ఇంకా ఎన్నో ఫీచర్లు ఉన్నప్పటికీ ఈ portrait మోడ్ ఆప్ మాత్రమే హై ఎండ్ మోడల్ లలో తప్పా దొరకని ఫీచర్. ఈ ఫీచర్ కేవలం ఆండ్రాయిడ్ లో ఓరియో ఆపరేటింగ్ సిస్టం పై నడుస్తున్న మొబైల్ లలో మాత్రమే పని చేస్తుంది.
PORTRAIT MODE ఫీచర్ మొహాన్ని గుర్తించడం ద్వారా పని చేస్తుంది. ఈ మొహాన్ని గుర్తించే టెక్నాలజీ కెమెరా కు ఉంటేనే ఈ ఆప్ portrait మోడ్ ఫీచర్ ని అందించగలుగుతుంది. PORTRAIT MODE అంటే వ్యక్తిని ఫోకస్ చేసి బ్యాక్ గ్రౌండ్ ని పూర్తిగా బ్లర్ చెయ్యడం. ఈ ఫీచర్ కు మాములుగా అయితే డ్యూయల్ కెమెరా అవసరం . కాని గూగుల్ ప్రత్యేక అల్గోరిథం ద్వారా ఈ PORTRAIT MODE ని ఒకే కెమెరా తోనే పని చేసేలా చెయ్యగలుగుతుంది. ఈ PORTRAIT MODE ఫీచర్ వ్యక్తి ఉంటె తప్ప పని చెయ్యదు. వ్యక్తి లేకపోతే PORTRAIT MODE అసలు ఆక్టివేట్ కూడా అవ్వదు.
ఈ ఆప్ ప్లే స్టోర్ లో ఇంకా లభించట్లేదు. దీనిని తాయారు చేసిన డెవలపర్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ ఫైల్ హోస్టింగ్ సైట్ ద్వారా దేన్నీ అందిస్తున్నాడు.
Install here : https://androidfilehost.com/?fid=817906626617956177