Latest Tech Uncategorized

ధరలు తగ్గించిన Jio – Jan 9 నుంచి అమలయ్యే కొత్త ప్లాన్ ల వివరాలు…

 

టెలికాం రంగంలో జియో తీసుకువచ్చిన భారీ మార్పుని చాల కంపెనీలు తట్టుకోలేక వినియోగదారులని ఆకర్షించే క్రమంలో అతి తక్కువ ధరలో ఆఫర్ లను ప్రకటిస్తున్నాయి. ఈ పోటీని జియో కూడా తట్టుకోలేకపోతుంది . అందుకే టారిఫ్ పెంచిన కొన్ని నెలలకే మల్లి టారిఫ్ తగ్గించి కొత్త ప్లాన్ లని ఈ జనవరి 9 వ తేది నుంచి అమలయ్యేలా ఆఫర్ లను విడుదల చేసింది. ఈ టారిఫ్ మార్పు లో భాగంగా 1.5 GB ప్రతీరోజు ప్లాన్ లని కూడా ప్రవేశ పెట్టింది.

1 GB ప్రతీరోజు లభించే ప్లాన్ లు అన్ని 50 రూపాయల తక్కువ ధరతోనే లభిస్తాయి. 1.5 GB వచ్చే ప్లాన్ లు అన్ని పాత 1GB వచ్చే ప్లాన్ ల ధరకే లభిస్తాయి. పై చిత్రంలో అన్ని ప్లాన్ వివరాలు చూడవచ్చు. ఈ ఆఫర్ మార్పులన్నీ ప్రైమ్ వినియోగదారులకి మాత్రమే వర్తిస్తాయి. ఈ కొత్త ప్లాన్ లో భాగంగా 91 రోజుల 1 GB ప్లాన్ ఇప్పుడు 449 రూపాయలకే లభిస్తుంది. 1.5 GB 91 రోజుల ప్లాన్ 498 రూపాయలకు లభిస్తుంది. ఈ కొత్త మార్పు ని పరిశీలిస్తే మాములుగా 1 GB లభించే ప్లాన్ లని 1.5 GB ప్లాన్ లుగా మారాయి అలాగే పాత 1 GB ప్లాన్ లు అన్ని 50 రూపాయల ధర తగ్గింపుతో లభిస్తున్నాయి.

ఎయిర్టెల్ మరియు ఐడియా కు సంబంధించిన ప్లాన్ వివరాలకోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *