RedMi 5a మరియు Tenor D తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లతో ప్రస్తుతం లభిస్తున్న 4G మొబైల్ ఫోన్ లు. రెండు మొబైల్స్ దాదాపుగా ఒకే ఫీచర్లు మరియు ధర ఉన్నపటికీ కొన్ని తేడాలతో రెండు వినియోగదారులని ఆకట్టుకుంటున్నాయి.
Red Mi 5a విషయానికి వస్తే 4,999, 5,999 ధరలో 2 GB + 16 GB , 3 GB + 32 GB మెమరీ ఆప్షన్ లలో లభిస్తుంది. క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 425 ప్రాసెసర్, 5 ” స్క్రీన్ , 13 MP రేర్ కెమెరా , 5 MP ఫ్రంట్ కెమెరా , 3000 mAh బ్యాట్టరీ కెపాసిటీ తో ఈ మొబైల్ లభిస్తుంది.
Tenor D విషయానికి వస్తే ఈ మొబైల్ కూడా RedMi5A లాగానే 4,999, 5,999 ధరలో 2 GB + 16 GB , 3 GB + 32 GB మెమరీ ఆప్షన్ లలో లభిస్తుంది. 5.2 ” స్క్రీన్ లభిస్తుంది. 3500 mAh బ్యాట్టేరి కెపాసిటీ , క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 425 ప్రాసెసర్ , 13 MP రేర్ కెమెరా , 5 MP ఫ్రంట్ కెమెరా ఆప్షన్ లతో Tenor D లభిస్తుంది.
ఫీచర్ల విషయానికి వస్తే Redmi5A , Tenor D కంటే స్క్రీన్ సైజు విషయం లోను, బ్యాట్టరీ విషయంలోనూ తక్కువగా ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫీచర్ Tenor D లో లభిస్తుండగా RedMi 5A లో మాత్రం లభించదు. Cloud Sync ఫీచర్ Tenor D లో లేదు , Redmi 5A లో లభిస్తుంది.
ఫీచర్లు పక్కనపెడితే RedMi 5a తీస్కుంటే భవిష్యత్ లో ఆపరేటింగ్ సిస్టం అప్ డేట్ కు అవకాశాలు ఉన్నాయి . Tenor D అప్ డేట్ విషయం కచితంగా చెప్పలేం .
ధర విషయంలో రెండు ఒకటే కాబట్టి ఫీచర్ల పరంగా Tenor D మెరుగ్గా ఉంటే , బ్రాండ్ మరియు భవిష్యత్ అప్ డేట్ ల పరంగా RedMI 5A తీసుకోవడం ఉత్తమం.