Mobile Uncategorized

Redmi Note 5, Redmi Note 5 Pro, Mi TV లాంచ్ చేసిన Xiaomi

 

ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న RedMi Note 5 మొబైల్ ని షియోమి కంపెనీ ఈరోజు విడుదల చేసింది. RedMi Note 5 తో పాటు RedMi Note 5 Pro, Mi TV లను కూడా విడుదల చేసింది.

MiTV ధర 39,999 కాగా , 4.9 ఇంచ్ మందం, 55 ఇంచ్ ల వెడల్పు, 4K వీడియో క్వాలిటీ, అలాగే PatchWall వెబ్ ఆపరేటింగ్ సిస్టం సహితంగా ఈ TV విడుదల అయింది . త్వరలో ఆన్ లైన్ మరియు ఆఫ్ లైన్ స్టోర్ లలో అమ్మకాలు జరుగుతాయి అని కంపెనీ తెలిపింది.

బ్లూటూత్ రిమోట్ ఉండడం ఈ TV లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం. ఈ రిమోట్ వల్ల టీవీ వైపు పాయింట్ చేసి రిమోట్ ఉపయోగించాల్సిన అవసరం లేదు.

ఇంటర్నెట్ కనెక్టివిటీ కోసం వై ఫై , బ్లూటూత్ , ఈథర్ నెట్ , HDMI , USB పద్దతుల్లో కనెక్ట్ చేసుకోవచ్చు . ఇండియాలో ఉన్న డిజిటల్ కంటెంట్ కోసం హాట్ స్టార్, voot, Viu, Hungama లాంటి సంస్థలతో టై అప్ అవ్వడం వలన డిజిటల్ కంటెంట్ ని ఆస్వాదించవచ్చు.

ఈ MiTV  2GB RAM , 8 GB ఇంటర్నల్ మెమరీ సహితంగా లభిస్తుంది. MiTV 5 రూపాయల కాయిన్ అంత స్లిమ్ గా ఉంటుందని షియోమి వెబ్ సైట్ లో తెలిపింది.

RedMi Note 5 & RedMi Note 5 Pro

RedMi Note 5 Pro మొబైల్ లో రెండు మెమరీ వేరియంట్ లలో విడుదల అవుతుంది. 6 GB + 64 GB ధర 16,999 రూపాయలు కాగా , 4 GB + 64 GB ధర 13,999 రూపాయలు. ఈ మొబైల్ డిజైన్ పరంగా RedMi Note 5 లాగా ఉండదు. ఈ ప్రో మొబైల్ లో డ్యూయల్ కెమెరా ప్రవేశ పెట్టడం వలన వెనుక వైపున డిజైన్ కొద్దిగా మార్చారు.

RedMi Note 5 Pro లో కొత్తగా జోడించిన ఫీచర్లు : Face Unlock , Front Side Flash Light, Dual Camera, 20 MP camera (Front Side), Beauty 4.0.

ఈ ఫీచర్లు RedMi Note 5 మొబైల్ లో లేవు.

RedMi Note 5 Pro ఫీచర్లు :

4 GB RAM + 64 GB Internal Memory

6 GB RAM + 64 GB Internal Memory

4,000 mAH బ్యాట్టరీ

12 MP + 5 MP రేర్ డ్యూయల్ కెమెరా

20 MP ఫ్రంట్ కెమెరా ఫ్లాష్ లైట్ సహితంగా

స్నాప్ డ్రాగన్ 636 ప్రాసెసర్

5.9 ఇంచ్ స్క్రీన్ .

Buy Here : http://buy.mi.com/in/buy/product/redmi-note-5-pro

RedMi Note 5 ఫీచర్లు : RedMi Note 5 మొబైల్  రెండు మెమరీ వేరియంట్ లలో విడుదల అవుతుంది. 3 GB + 32 GB ధర 9,999 రూపాయలు కాగా , 4 GB + 64 GB ధర 11,999 రూపాయలు. ఈ మొబైల్ డిజైన్ పరంగా RedMi Note 4 లాగా ఉన్నప్పటికి ముందు వైపు మాత్రం ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఉంటుంది.

3 GB RAM + 32 GB Internal Memory

4 GB RAM + 6 GB Internal Memory

5.99 ఇంచ్ స్క్రీన్

4,000 / 3,900 mAh బ్యాట్టరీ

12 MP రేర్ కెమెరా + 5 MP ఫ్రంట్ కెమెరా

Buy Here : http://buy.mi.com/in/buy/product/redmi-note5

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *