Apps Uncategorized

ఇండియా లో UPI పేమెంట్స్ ప్రారంభించిన Whatsapp

ఇండియా లో ఎప్పట్నుంచో అనుకుంటున్న whatsapp యొక్క పేమెంట్స్ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం బీటా వినియోగదారులకి మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులో ఉన్నట్లు తెలుస్తుంది.

ఇండియా లో గూగుల్, paytm, ఫ్లిప్ కార్ట్, అమెజాన్ లాంటి సంస్థలు తమ సొంత పేమెంట్ ఆప్ లని UPI పద్దతిలో వదిలి చాలా కాలమైంది.

whatsapp కు ఉన్న వినియోగదారుల దృష్ట్యా ఇప్పుడు విడుదల చేసినప్పటికీ మార్కెట్ ను అందుకోవడం పెద్ద కష్టమైనా పనేమీ కాదు.

ఈ whatsapp పేమెంట్ ఫీచర్ లో మనం అమౌంట్ సెండ్ చెయ్యాలి అనుకుంటున్నా వ్యక్తికి కూడా whatsapp UPI ఆక్టివేట్ చేసుకుని ఉండాలి. వేరే ఆప్ కు సంబంధించిన UPI కు పంపే సౌలభ్యం ప్రస్తుతం ఇందులో లేదు.

గూగుల్ , ఫ్లిప్ కార్ట్ లకు సంబంధించిన UPI ఆప్ లలో ఏ ఆప్ / బాంక్ కు సంబంధించిన UPI అడ్రస్ కు ఐన అమౌంట్ పంపించవచ్చు.

ఇంకా పూర్తి ఫీచర్లు బీటా ఆప్ లో ఇవలేద్నట్లు బీటా అప్ వినియోగించిన వినియోగదారులు భావిస్తున్నారు.

ఈ ఫీచర్ పై paytm సంస్థ సీఈఓ విజయ్ శేఖర్ శర్మ విమర్శలు గుప్పించారు. ఈ ఆప్ ద్వారా UPI పద్ధతి ని facebook (whatsapp ను కొన్న సంస్థ ) నియంత్రించే అవకాశాలు ఉంటాయని , అందుకే ఆ ఆప్ ను అనుమతించకపోవడమే మంచిది అని అభిప్రాయ పడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *